
ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేకిన్ ఇండియా అని మోడీనే అన్నారని..ఇండియా పేరును తీసేసి భారత్ ఎలా పెడతారని ప్రశ్నించారు. మోడీ ఇండియా కూటమిని ఎదుర్కోలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించడం లేదన్నారు.దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు రేవంత్.
ALSO READ : ఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావు : వైఎస్ షర్మిల
ప్రాంతాలు, కులాలు,మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని మండిపడ్డారు రేవంత్. మోడీ పాలనలో ఏం అభివృద్ధిజరగడం లేదని.. కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. హరిత విప్లవం తెచ్చిందే కాంగ్రెస్సేనన్నారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు . కేసీఆర్ కు ఎంఐఎం ఎలా మద్దతిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన చీడ,పీడ కల్వకుంట్ల కేసీఆర్ అని మండిపడ్డారు. హైదరాబాద్ లో 16,17, 18న జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు.