
2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చాక మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ముస్లిం, మైనార్టీలను TRS సర్కార్ మోసం చేసిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోయి ముస్లిం, మైనార్టీలను మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఎప్పుడూ మైనార్టీల పక్షానే నిలిచిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని.. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెసే నని చెప్పారు. అంతేకాదు.. త్రిబుల్ తలాక్, NRC,CAA వంటి చట్టాలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలంటి చట్టాలు తెచ్చే దైర్యం చేసేవారా అని ప్రశ్నించారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అంతేకాదు..రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనన్న రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే నంటూ ప్రజలను కోరారు.
వక్ఫ్ భూముల విషయంలో కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదన్నారు నేతలు. దళిత బంధు లాగే ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ.. ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు.