వసూళ్ల కోసమే  టాస్క్ ఫోర్స్ కమిటీ

వసూళ్ల  కోసమే  టాస్క్ ఫోర్స్ కమిటీ


వసూళ్ల కోసమే  ప్రగతి భవన్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. టాస్క్ ఫోర్స్ కమిటీలో వసూల్ టీం మాత్రమే ఉందని..వైద్యులు ఎవరూ లేరన్నారు. కార్పొరేట్ కంపెనీలను పిలిచి దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మల్లాపూర్ లో ఒక గర్భిణీ వైద్యం అందక చనిపోవడం బాధాకరమన్నారు. తల్లిని బిడ్డను వేరు చేస్తేనే  దహనం చేస్తామని శ్మశాన సిబ్బంది తిరస్కరించారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు కూడా లేక ప్రాణాలు కోల్పోవడం  ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.. కాంగ్రెస్ నాయకుల మీద వేధింపులు ఆపాలన్నారు. రెమిడెసివర్ బ్లాక్ మార్కెట్ అయ్యిందన్నారు. టీఆర్ఎస్  నాయకులు కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారని.. వారికి కావాల్సిన వాళ్లకు రెమ్ డెసివర్ ఇస్తున్నారన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజు కరోనా బాధితులకు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభించారు.