లక్షమందితో ఇంద్రవెల్లిలో దండోరా మోగిస్తా

లక్షమందితో ఇంద్రవెల్లిలో దండోరా మోగిస్తా

తెలంగాణలో సోనియమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేయాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ జెండా మోసినోళ్లకే పదవులిస్తామన్నారు. తనకు చుట్టం ఐతే ఇంటికి రావాలి కానీ పార్టీలో అందరు సమానమేనన్నారు. పీసీసీ ఎంపికలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారన్నారు. సోనియా నిర్ణయం తీసుకోకముందు అందరి అభిప్రాయాలను గౌరవించాలన్నారు. హుజురాబాద్ లో  దళితులకు రూ. 10లక్షలు ఇస్తే.. మిగతా 118 నియోజకవర్గాల్లో దళితుల సంగతేంటన్నారు. 

గద్దరన్న స్ఫూర్తి తీసుకొని దళిత, గిరిజన దండోరా మొదలు పెడ్తున్నామన్నారు. ఆగస్ట్ 9న ఇంద్రవెల్లి నుండి ఈ దండోరా మొదలై.. సెప్టెంబర్  17 వరకు దళిత, గిరిజన దండోరా కొనసాగుతుందన్నారు. లక్షమందితో దండు కట్టి ఇంద్రవెల్లిలో దండోరా మోగిస్తానన్నారు. సీఎం కేసీఆర్ దళిత, గిరిజన, బీసీ కులాలను ఓట్ల మిషన్ గా చూస్తున్నారన్నారు. సోనియమ్మ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఇచ్చిందో అది నెరవేరడం లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయక నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారన్నారు .కేసీఆర్ బంగారు తెలంగాణ అని.. అప్పుల తెలంగాణగా మార్చేశాడన్నారు.