
కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఓనర్లు లేరని.. కష్ట పడ్డోల్లే ఓనర్లన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తనను చూసి ఎదగడం నేర్చుకోవాలన్నారు. తాను 15 ఏళ్లల్లో పీసీసీ చీఫ్ వరకు ఎదిగానన్నారు. తాను ఏనాడు పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉందనే తనను పీసీసీ చీఫ్ గా నియమించిందన్నారు. యువకుడు గట్టిగా కొట్లాడుతాడని భావించిన కాంగ్రెస్..తన అవసరం, స్పీడ్ ను చూసి పదవులు కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ లో యువకులు మంచ అవకాశాలుంటాయన్నారు. మీరు కష్టపడితే.. మీ ఇంటికొచ్చి టికెట్ ఇచ్చే బాధ్యత తనదన్నారు. వైఎస్సార్ కు 34ఏళ్లకే పీసీసీ చీఫ్ గా రాజీవ్ గాంధీ అవకాశం ఇచ్చారన్నారు. మమత బెనర్జీ, అంబికా సోనీ, సంజయ్ గాంధీ, శరత్ పవర్ లాంటి వాళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేశారన్నారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి చదువుతున్న వాళ్ళు కనిపిస్తున్నారన్నారు.