హైదరాబాద్, వెలుగు: మియాపూర్లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను సీఎం రేవంత్ రెడ్డి కాపాడారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. ఈ భూముల విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు.
ఈ భూములపై కోర్టు తీర్పు కేసీఆర్, బీఆర్ఎస్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రభుత్వ భూముల్లో ఒక్క ఇంచు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారని తెలిపారు. భూములను కాపాడేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
