
హైదరాబాద్: రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. టీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గూండాలు కాంగ్రెస్ నేతను హత్య చేశారని తెలిపారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దన్నందుకు.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్య చేశారని దుయ్యబట్టారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.