2016 కంటే మెరుగైన ఫలితాలు సాధించాం

2016 కంటే మెరుగైన ఫలితాలు సాధించాం

హైదరాబాద్ : కేంద్రం నుండి  బీజేపీ అగ్ర నేతలు దేశం నలుమూలల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. TRS తరుపున గల్లీలో మంత్రి తిరిగాడని..మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక రకంగా సర్వశక్తులు కుమ్మరించి స్థానికంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని..కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన ప్రతి కార్యకర్త కు నమస్కారాలు అన్నారు.  మీడియా ఈ సారి తనవంతు పాత్ర పోషించ లేదని..తెలంగాణలో ప్రతి రాజకియ పార్టీ ఒక ఛానెల్ పెట్టలసిన అవసరం ఏర్పడిందని.. దీని వలన ప్రజా స్వామ్యం మీద నమ్మకం పోతుందన్నారు.

మా పార్టీ ఓడిపోవటానికి మీడియానే ప్రధాన కారణం అన్నారు. ప్యాకేజీ ఇవ్వలేక ఓడిపోయామన్నారు.టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు డబ్బులు మీడియా సంస్థలకు ఇచ్చి సీట్లు గెలిచాయన్నారు. 2016 లో 10.4 శాతం ఓట్లు వచ్చిన వాటిని ఎక్కడ చెప్పలేదని.. ఎంత సేపు బీజేపీ భజన చేస్తున్నారన్నారు. 2016 కంటే మేము మెరుగైన ఫలితాలు సాధించామని.. ఓటు బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగిందన్నారు రేవంత్ రెడ్డి.