విశ్వనగరం అని గప్పాలు పలికిన్రు..చినుకు పడితే చిత్తడే: రేవంత్

విశ్వనగరం అని గప్పాలు పలికిన్రు..చినుకు పడితే చిత్తడే: రేవంత్

కాళేశ్వరం మునగడం అయింది.. ఇగ హైదరాబాద్ మునుగుడు షురైందన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని  ట్విట్ చేశారు. ఇస్తాంబుల్.. చికాగో...విశ్వనగరం అని గప్పాలు పలికి.. రూ.కోట్లు పెట్టి ప్రచారాలు చేశారు.. కానీ చినుకు పడితే వణుకు ..అడుగు బయట పెడితే గల్లంతు అంటూ మండిపడ్డారు.  వర్షాకాలం అదే గోస.. చలికాలం కూడా అదే వరుస అంటూ విమర్శించారు.  రూ. వేల కోట్ల ఖర్చు ఫలితం ఇదేనా అంటూ ప్రశ్నించారు.  కమిషన్ల పేరుతో మొత్తం మీరే మేసేస్తే.. ఇక మార్పెక్కడి నుంచి వస్తుందన్నారు. అందుకే మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు రేవంత్.

 కాసేపటి నుంచి హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ,అమీర్ పేట, కూకట్ పల్లి, ఖైరతాబాద్,చందానగర్,  మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్, హిమయాత్ నగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, కొంపల్లి,దూలపల్లి,గండిమైసమ్మ, బాహుదూర్ పల్లి,మల్లంపేట్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం దంచికొడుతోంది.  రహదారులన్నీ జలయమం అయ్యాయి. . భారీగా వరద నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది