
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షోభంలో చిక్కుకుందా? అని ప్రశ్నించారు. రూ.16 వేల కోట్ల మిగులుతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కేసీఆర్ చేతుల్లో పెట్టిందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీతాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న వేతన జీవులే దీనికి సాక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.