మోడీ, కేసీఆర్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసిన్రు : రేవంత్ రెడ్డి

మోడీ, కేసీఆర్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసిన్రు : రేవంత్ రెడ్డి

బడ్జెట్ లో  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి  విమర్శించారు. 45  లక్షల కోట్లతో  బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపెట్టిందన్నారు.  ఈ విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు దోషులేనని విమర్శించారు. ప్రధాని మోడీ, కేసీఆర్  ఇద్దరు తోడుదొంగలుగా తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా సీఎం కేసీఆర్ మోడీ దగ్గర కాళ్ల భేరానికి వచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించి.. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజరాత్ కు ఎటువంటి ప్రాధాన్యత కల్పించారో తెలంగాణకు కూడా అలాంటి ప్రాధాన్యతే కల్పించాలన్నారు.