
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 15-_19 మధ్య దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశమవుతారు.
తెలంగాణలో పెట్టుబడుల అంశంపై వారితో చర్చించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొంటారు.