ప్రమాణ స్వీకారానికి రండి : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాలు

ప్రమాణ స్వీకారానికి రండి : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి 2023 డిసెంబర్ 07 గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటుగా పలువురు రాజకీయ నాయకులను కలిసి స్వయంగా ఆహ్వానించారు రేవంత్. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి..  సోనియా, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని  కోరారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పెద్దలకు ఫోన్లు చేసి రావాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధినేతలకు ఫోన్ చేసి రావాలని కోరారు. 

ఆహ్వానం అందుకున్న వారిలో 

  • కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. 
  • తమిళనాడు సీఎం స్టాలిన్
  • ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం
  • మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపారు
  • తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. 
  • తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు 
  • కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు.
  • రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం 
  • మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం .
  • హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం 


మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.  సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. డీజీపీ కూడా ఏర్పాట్లను పరిశీలించారు.  ఎల్బీ స్టేడియంలో  ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పర్యవేక్షించారు.  ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తుపను ఏర్పాటు చేశారు.  

Also Read:-ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి