పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస్తారు

పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస్తారు

వడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస్తారన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు సభలో మాట్లాడిన రేవంత్..  చివరి గింజ వరకు ప్రభుత్వం కొనాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ను రైతులు పాతాళానికి తొక్కుతారన్నారు. పసుపు, ఎర్రజొన్న పండించిన రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వరి వేయకపోతే 24 గంటల కరెంట్, కాళేశ్వరం నీళ్లు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో  ధాన్యం కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనకపోతే కేసీఆర్ వడ్లు కొనొచ్చు కదా అని ప్రశ్నించారు. వడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తానన్నారు. నీళ్లు, నిధులు,నియామకాలు అనే నినాదంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. నీళ్లు జగన్ కు, నిధులు మెఘా కృష్ణారెడ్డికి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయన్నారు రేవంత్.

నల్లమడుగు సురేందర్ ను గెలిపిస్తే టీఆర్ఎస్ లో చేరాడన్నారు.  పార్టీ ఫిరాయించినోళ్లకు బుద్ధి చెబుతామన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.  చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తానని కవిత గతంలో హామీ ఇచ్చారన్నారు. చెరుకు ఫ్యాక్టరీ తెరవకుండా రైతుల కడుపు కొట్టారన్నారు. మాట ఇచ్చి తప్పింది కాబట్టే నిజామాబాద్ లో కవితను  ఓడించారన్నారు. పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిన వారికి కూడా అదే గతి పడుతుందన్నారు . ప్రధాని మోడీ మెడలు వంచిన ఘనత రైతులదన్నారు రేవంత్.