మీ మన్ కీ బాత్ కాదు.. వలస కూలీల మన్ కీ బాత్ వినండి

మీ మన్ కీ బాత్ కాదు.. వలస కూలీల మన్ కీ బాత్ వినండి

కరోనా నేపథ్యంలో వలస కూలీల గురించి ప్రధాని మోడీ మరచిపోయాయని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోనికి రాగానే స్విస్ బ్యాంకు నుంచి నల్ల డబ్బును వెనక్కు తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తామన్నారు కానీ చేయలేదని ఆయన అన్నారు. లాక్ డౌన్ పై ‘స్పీక్ అప్ ఇండియా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న పోరాటంలో ఆయన పాల్గొన్నారు.

‘కరోనా వల్ల చితికిపోయి.. ఉపాధి కొల్పోయి వందల కిలోమీటర్లు నడుస్తున్న వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్నతరహా పరిశ్రమలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి. వచ్చే ఆరు నెలలు పేదలకు నెలకు రూ. 7500 ఆర్థికసాయం చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. ఇంత కాలం మన్ కీ బాత్ పేరుతో మీరు మీ మనసులోని మాట చెప్పారు. ఇప్పుడు పేద వలస కూలీలు చెప్పే మన్ కీ బాత్ వినండి. ప్రభుత్వం పెట్టే దుబార ఖర్చు బంద్ చేయండి. ఆ డబ్బుతో పేదలను ఆదుకోండి’ అని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

For More News..

అందుబాటులోకి వీడియో కెవైసీ సదుపాయం

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

పనివాళ్లను ఫ్లైట్లో సొంతూరికి పంపించిన యజమాని

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు