ఖర్గేకు రేవంత్ పరామర్శ.. హెల్త్ కండిషన్ను అడిగి తెలుసుకున్న సీఎం

ఖర్గేకు రేవంత్ పరామర్శ.. హెల్త్ కండిషన్ను అడిగి తెలుసుకున్న సీఎం

బెంగళూరు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 06)  బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్  ఖర్గేను పరామర్శించారు. ఇటీవల ఖర్గే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్  అయ్యారు. 

ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతుండగా ఆయన గుండె వేగం తగ్గకుండా వైద్యులు పేస్ మేకర్  ఇంప్లాట్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్  బెంగళూరు వెళ్లి ఖర్గేను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తిరిగి రాత్రి 10.30 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌‌  చేరుకున్నారు. సీఎం తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా ఖర్గేను పరామర్శించారు.