రేవంత్​ సర్కార్​ కీలక నిర్ణయం: మూడేళ్లలో ఓఆర్​ఆర్​ పూర్తిచేస్తాం..

రేవంత్​ సర్కార్​ కీలక నిర్ణయం:  మూడేళ్లలో ఓఆర్​ఆర్​ పూర్తిచేస్తాం..
  • 3 నెలల్లో పనులు స్టార్ట్..  మూడేండ్లలో పూర్తి

  • ట్రిపుల్ ఆర్​ నిర్మాణానికి సర్కార్​ టైం ఫ్రేమ్

  • 2027 కల్లా నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం

  • ఇప్పటికే నార్త్ సైడ్​ భూసేకరణ 90 శాతం పూర్తి

  • కోర్టు పరిధిలోని 300 హెక్టార్లకు 5 రోజుల్లో గ్రీన్ సిగ్నల్సౌ

  • త్ అలైన్​మెంట్​ ఖరారు కాగానే యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ

  • నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్​) నిర్మాణాన్ని మూడేండ్లలోపే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కారు టార్గెట్​గా పెట్టుకున్నది. 2027 డిసెంబర్ కల్లా సౌత్ అండ్ నార్త్ రెండు వైపులా నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్​ చేస్తున్నది. రెండు, మూడు నెలల గ్యాప్​లోనే ఇరువైపులా పనులను మొదలుపెట్టడమే కాకుండా.. సమాంతరంగా వర్క్స్​చేయడంపైనా ఫోకస్​పెట్టింది. 

నేషనల్​హైవేస్​కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నార్త్​​సైడ్​ అలైన్​మెంట్ పూర్తికాగా.. భూసేకరణ కూడా 90 శాతం కంప్లీట్​అయింది. దాదాపు 750 ఎకరాల వరకు హైకోర్టులో కేసు నడుస్తున్నది. అది కూడా అలైన్​మెంట్​ మార్పు కోరుతూ వేసిన పిటిషన్​ కావడంతో..  వారం రోజుల్లో వెకెంట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక సౌత్​​కు సంబంధించి ఫ్యూచర్​ సిటీని దృష్టిలో పెట్టుకొని, అలైన్​మెంట్​ ప్లాన్​ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్​ఆర్​పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రభుత్వం తరఫున యాక్షన్​ ప్లాన్​ను అందివ్వనున్నట్టు తెలుస్తున్నది. తొలుత రీజినల్‌‌ రింగ్​ రోడ్డును 4 లేన్లకే పరిమితం చేసి, ఆ తర్వాత మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగిన సమయంలో నిర్మించనున్నట్టు తెలిసింది. భూసేకరణ మాత్రం 8 లేన్లకు సరిపడా చేస్తున్నారు.   

3–4 నెలల గ్యాప్​లోనే..

హైదరాబాద్‌‌తోపాటు మరో ఏడు జిల్లాల ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు దక్షిణ భాగం, ఉత్తర భాగం కలిపితే దాదాపు 350 కిలో మీటర్లకు కొంచెం అటు ఇటుగా ఉండనుంది. ఇప్పటికే నార్త్​రింగ్​కు  (ఎన్‌‌హెచ్‌‌-65 మీదుగా తూప్రాన్‌‌, గజ్వేల్‌‌, చౌటుప్పల్‌‌) సంబంధించి 158 కిలో మీటర్లకు అలైన్​మెంట్​పూర్తయింది. 4 వేల 875 ఎకరాల భూ సేకరణ కూడా కంప్లీట్​అయింది. అలైన్​మెంట్​ మార్చాలంటూ కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇది దాదాపు 750 ఎకరాలు ఉంది. 

పరిహారం విషయంలో ఎక్కడా సమస్య లేకపోవడం, అలైన్ మెంట్​అనేది మార్చడం సాధ్యం కాదనే విషయాన్ని కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. దీంతో వారం, పదిరోజుల్లో ఈ కేసు పూర్తి కానుంది. ఆ వెంటనే భూసేకరణ కంప్లీట్​చేసి, నేషనల్​హైవేస్​కు అప్పగించనున్నది. దీంతో టెండర్​ నోటిఫికేషన్​వేసి, నిర్మాణ పనులు మొదలుపెట్టేలా ముందుకు వెళ్తున్నది. ఇక దక్షిణ భాగానికి సంబంధించి 190 నుంచి 194 కిలో మీటర్ల వరకు అలైన్​మెంట్ఉండే అవకాశం ఉన్నది. 

ఈ అలైన్​మెంట్​ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 12 మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. వాట్సాప్‌‌ గ్రూప్‌‌ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్‌‌డేట్‌‌ చేస్తున్నారు. ట్రిపుల్ఆర్​ పురోగతిపై రోజువారీ సమీక్షలతోపాటు  భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రతిరోజూ సీఎం రేవంత్​ రెడ్డి మానిటర్ చేస్తున్నారు. 

 అలైన్​మెంట్​కంప్లీట్​ చేయగానే.. ఒకసారి ఎన్ హెచ్ఏఐ తో సంప్రదింపులు జరిపి, ఫైనలైజ్ చేస్తారు. రెండు, మూడు నెలల్లోపే భూ సేకరణ పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే  నేషనల్​హైవేస్​కు అప్పగించనున్నట్టు తెలుస్తున్నది. ట్రిపుల్ఆర్​గురించి కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీకి  రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నది. ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నది.

 ఫ్యూచర్​ సిటీని కనెక్ట్​ చేస్తూ.. ఓఆర్ఆర్​కూ అనుసంధానం

ఫ్యూచర్​ సిటీ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో.. ఈ సిటీని రీజినల్​ రింగ్​ రోడ్డుకు లింక్​ చేయనున్నది. అదే సమయంలో ఓఆర్ఆర్​కూ ట్రిపుల్​ఆర్​కనెక్టివిటీ ఉండేలా ప్లాన్​ చేస్తున్నది. ఇందుకోసం గ్రీన్​ఫీల్డ్​ రేడియల్​రోడ్లు వేయనున్నది. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్‌‌ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవిష్యత్తులో ఈ మార్గంలో వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగానే ఓఆర్‌‌ఆర్‌‌ ఎగ్జిట్‌‌ నంబర్‌‌ 13 రావిర్యాల నుంచి ట్రిపుల్ఆర్​లోని ఆమన్‌‌గల్‌‌ ఎగ్జిట్‌‌ నంబర్‌‌–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌‌ఫీల్డ్‌‌ రేడియల్‌‌ రోడ్డు నిర్మించనున్నది. ఈ మార్గం మొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనున్నది. 

భూనిర్వాసితులకు తగిన పరిహారం

ట్రిపుల్ ఆర్​లో భూములు కోల్పోతున్న వారికి తగిన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే నార్త్​లో కొందరికి సవరించిన మార్కెట్​వాల్యూకు తగ్గట్టుగా పరిహారం అందిస్తున్నది. సౌత్​ సైడ్​కు సంబంధించి కూడా పెంచిన పరిహారమే అందనున్నది. త్వరలోనే ప్రభుత్వం మార్కెట్​ వాల్యూను సవరించనున్నది. దీంతోపాటు ఆయా ఏరియాల్లో గరిష్టంగా ఏ రేటుకు భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయో దాంట్లో హయ్యెస్ట్​ తీసుకొని అటు ప్రభుత్వ రేటు.. అంతకు మించి ఎక్కువకు కొనుగోళ్లు చేసిన రేటులో నుంచి యావరేజ్​ తీసి దానికి మూడింతలపరిహారం ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయించింది. 

ఉదాహరణకు ఒక ఎకరాకు ప్రభుత్వ మార్కెట్​రేటు రూ.10 లక్షలు ఉంటే.. బహిరంగంగా 15 లక్షలకు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి ఉంటే.. ఇందులో యావరేజ్​ రూ.13 లక్షలు తీసుకొని, దీనిని మూడింతలు అంటే రూ.39 లక్షలు చేసి పరిహారం ఇవ్వనున్నారు. దీంతో రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని, భూసేకరణ కూడా వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అవసరమైతే అంత కంటే ఎక్కువే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నది.