కానుకల కోసం దేవాదాయ శాఖ కొత్త ఐడియా

కానుకల కోసం దేవాదాయ శాఖ కొత్త ఐడియా
  • అందుబాటులోకి క్యూఆర్‌‌ కోడ్‌
  • దేవాదాయ శాఖ కొత్త ఐడియా

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: మేడారంలో డిజిటల్‌‌ హుండీలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. 2020 మహాజాతరలో దేవాదాయ శాఖ 494 హుండీలను ఏర్పాటు చేయగా రూ.11.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మహాజాతరలో క్యూ ఆర్‌‌ కోడ్‌‌ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు మేడారం టెంపుల్‌‌ పరిసరాల్లో ఆఫీసర్లు 20 డిజిటల్‌ స్టిక్కర్లను ఏర్పాటు చేయనున్నారు. కెనరా బ్యాంకు సౌజన్యంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్‌‌ఫోన్‌‌ ద్వారా ఫోన్‌‌ పే, గూగుల్‌‌ పే, పేటీఎం నుంచి క్యూ ఆర్‌‌ కోడ్‌‌ స్కాన్‌‌ చేసి భీమ్‌‌ యూపీఐ ద్వారా అమ్మవార్లకు కానుకలు చెల్లించుకోవచ్చు. కరోనా థర్డ్‌‌ వేవ్‌‌ నేపథ్యంలో ఈ సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టినట్లుగా మేడారం ఈఓ రాజేందర్‌‌ చెప్పారు.