
జగిత్యాల జిల్లా: నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జిల్లా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. మంగళవారం మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో జగిత్యాల కలెక్టర్‌పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను జిల్లా రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. మేం రాజీనామా చేసి ఎంపీగా గెలుస్తాం.. నువ్వు రాజీనామా చేసి కలెక్టర్ కాగలవా అంటూ ప్రశ్నించారు. ఎంపీగా, విద్యావేత్తగా ఉన్న మీరు కలెక్టర్‌పై ఇష్టానుసారం మాట్లాడటం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని నాయకులు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల మేరకే కొనుగోళ్లుంటాయని మీకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రచారం కోసమే కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కలెక్టర్, ఉద్యోగులపై ఇష్టానుసారం మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే ఎంపీ అరవింద్.. కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని జిల్లా రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేశాయి.