తెలంగాణ కో–ఆపరేటివ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. ఎంబీఏ/ పీజీ చేసిన వారికి మంచి ఛాన్స్..

తెలంగాణ కో–ఆపరేటివ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. ఎంబీఏ/ పీజీ  చేసిన వారికి మంచి ఛాన్స్..

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కో–ఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆఫ్​లైన్​లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 23. 

పోస్టులు: 07.

ఖాళీల వివరాలు: ఆదిలాబాద్ డీసీసీబీ 01, ఖమ్మం డీసీసీబీ 01, కరీంనగర్ డీసీసీబీ 01, మహబూబ్ నగర్ డీసీసీబీ 01, నల్గొండ డీసీసీబీ 01, నిజామాబాద్ డీసీసీబీ 01, వరంగల్ డీసీసీబీ 01.  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ / కో–ఆపరేటివ్ మేనేజ్ మెంట్/ అగ్రి బిజినెస్ మేనేజ్​మెంట్/ రూరల్ డెవలప్​మెంట్ మేనేజ్​మెంట్​లో ఎంబీఏ లేదా రెండేండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కంప్యూటర్ అప్లికేషన్స్, తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్​మెంట్ డిపార్ట్​మెంట్, ది తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్ – 500001 చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 23. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఆన్​లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు tscab.org వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | హైదరాబాద్ ESIలో ఉద్యోగాల జాతర.. ఎలాంటి పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్..