ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 2025, డిసెంబర్ 29 నుంచి 2026, జనవరి 07 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పోస్టులు: 102 (ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్, మెడికల్ ఆఫీసర్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, డీసీహెచ్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మన్, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు esic.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
