
కేశంపేట, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్ల తప్పుతో ఐదెకరాల రైతు 90 ఎకరాల భూస్వామిఅయ్యాడు. పెద్ద రైతులకు ఇంకా డబ్బులు రాలేదంటూ వ్యవసాయ అధికారులు రైతు బంధు ఆలస్యం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి పంచాయతీ మీనమోనిపల్లి గ్రామానికి చెందిన అనపోసల బుచ్చయ్యకు 5.395 ఎకరాల పొలం ఉంది.ఇది వివిధ సర్వే నంబర్లలో ఉంది. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అతను వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిం చాడు. నీకు దాదాపు 90 ఎకరాల భూమి ఉందని.. పెద్ద రైతులకు డబ్బులు ఇంకా జమచేయలేదని
చెప్ పారు. దీంతో రైతు మీసేవలో భూమికి సంబంధించి ఆర్వోఆర్ తీశాడు. 52/ఈ/1 సర్వే నంబర్‌లో తనకు ఒక ఎకరం పొలం ఉండగా రెవెన్యూ సిబ్బంది రికార్డుల్లో 87.28 ఎకరాలుగా నమోదు చేసిన విషయం బయటపడింది. దీనిపై రైతు రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. నెల రోజులు గడుస్తున్నాసరి చేయడం లేదని.. వారు చేసిన తప్పిదానికి తాను తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సివస్తోందని వాపోతున్నాడు. ఈ విషయంపై స్థానిక ఇన్ చార్జ్ తహసీల్దార్‌ను ప్రశ్నించగా రికార్డు నమోదులో పొరపాటును గుర్తించామని, ఇప్పటికే సమస్యను వ్యవసాయ అధికారులు, ఆర్డీవో దృష్టికి తీసుకువె ళ్లామన్నారు. పరిష్కరించడంలో కొం త ఆలస్యం జరిగి న మాట వాస్తవమేనని త్వరలోనే సరి చేస్తామన్నారు.