నా భూమిని ప్రభుత్వం లాక్కుంది

నా భూమిని ప్రభుత్వం లాక్కుంది

సిద్దిపేట రూరల్, వెలుగు: తన భూమి రికార్డులను రెవెన్యూ అధికారులు తారుమారు చేశారంటూ ఓ రైతు తహసీల్దార్ ఆఫీస్​ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన కాసుల కిష్టయ్యకు 1975లో అప్పటి ప్రభుత్వం రెండెకరాల భూమి మంజూరు చేసింది. రెండు నెలలుగా ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ లో అతని పేరు రావడం లేదు. అదేమని వీఆర్వోను అడగగా దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు.

దాంతో తన భూమిని తనకు అప్పగించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ గురువారం పెట్రోల్ బాటిల్ తో అర్బన్ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాడు. తహసీల్దార్, పోలీసులు అతనికి సర్దిచెప్పి పంపించారు. ఈ విషయంపై అర్బన్ తహసీల్దార్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కిష్టయ్య భూమిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికి 2012లో అమ్ముకున్నాడని, అది సీలింగ్ భూమి కావడంతో ఇద్దరికి నోటీస్​లు పంపి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి