V6 News

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..పశ్చిమాసియా పరిస్థితులపై సమీక్ష

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..పశ్చిమాసియా పరిస్థితులపై సమీక్ష

పశ్చిమాసియా ఉద్రిక్తత నడుమ అమెరికా, ఇరాన్  మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఫోన్ ద్వారా మాట్లాడారు.  ఈ సంభాషణలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితు, పరస్పర ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచడం, సురక్షితంగా నౌకలు రాకపోకలు అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. 

ట్రంప్ తో ఫోన్ సంభాషణపై ప్రధాని మోదీ  Xలో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమగ్రంగా చర్చించాం..వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని  బలోపేతం చేసేందుకు  కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై కూడా చర్చించాం..హోర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యత ఉందని మేం భావిస్తున్నామని మోదీ  అన్నారు.  

ఇక ఇరువురు నేత ఫోన్ సంభాషణపై మనదేశంలోని అమెరికా రాయబారి  సెర్గియో గోర్ కూడా ధృవీకరించారు. ప్రధాని మోదీ, ట్రంప్ కొద్ది నిమిషాల క్రితమే ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో  జరుగుతున్న పరిణామాలతో పాటు, వాషింగ్టన్‌లో అమెరికా, భారత్ మధ్య చోటుచేసుకుంటున్న కొన్ని కీలక అంశాలపై కూడా అధ్యక్షుడు తాజా సమాచారం అందించారు అని అని గోర్ అన్నారు.