
శంషాబాద్, వెలుగు: హైదరాబాద్ టు బ్యాంకాక్ నాన్‌స్టాప్ ఫ్లైట్లను సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో థాయ్ ఎయిర్ లైన్స్ అధికారులతో కలిసి ఎయిర్ పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ నాన్ స్టాప్ ఫ్లైట్లు ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయన్నారు.