ప్లేస్‌మెంట్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల ప్రతిభ

ప్లేస్‌మెంట్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల ప్రతిభ
  • వింటేజ్ కాఫీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో జాబ్లకు ఎంపిక

బాసర, వెలుగు: నిర్మల్ ​జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్​ఐటీ) విద్యార్థులు వింటేజ్ కాఫీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ లు ఎంపికయ్యారు. వర్సిటీలోని ఈఈఈ విభాగానికి చెందిన వగ్గు దీక్షిత్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి బొప్ప నితిన్, కుమ్మరి అర్చన, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం నుంచి బాలసాని హరీశ్ కుమార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి జి. వెంకటేశ్ సెలెక్ట్ అవడంతో  వీసీ గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్లేస్‌మెంట్కు నిర్వహించిన శిక్షణ ఎంతో ఉపయోగపడినట్లు ఆయన పేర్కొ న్నారు. వింటేజ్ కాఫీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్, ప్లేస్​మెంట్ అధికారులు ఎన్.విజయ్ కుమార్, శ్రీనివాస్, విద్యార్థులు ఉన్నారు.