Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రశ్న.. ఆన్సర్ ఏంటంటే..?

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రశ్న.. ఆన్సర్ ఏంటంటే..?

కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా అప్పుడప్పుడు క్రికెట్ పై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు క్రికెట్ ప్రేమికులు చాలా అలవోకగా సమాధానం చెప్పేస్తారు. కానీ హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. తాజాగా ఈ షో లో క్రికెట్ కు సంబంధించిన ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీపై ఆ ప్రశ్న అడగడం విశేషం. ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2025 లోజరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో ఏ ఇండియన్ క్రికెటర్ సెంచరీ కొట్టాడు అనే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి.. విరాట్ కోహ్లీ. ఈ క్రేజీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో భారత జట్టును గెలిపించాడు. 111 బంతుల్లో 107 పరుగులు చేసి ఎలాంటి తడబాటు లేకుండా చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఛేజింగ్ లో రోహిత్ శర్మ 20 పరుగులే చేసి ఔట్ కాగా.. గిల్ 46 పరుగులతో రాణించాడు. ఇక కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కే రాలేదు.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 62), మహ్మద్ రిజ్వాన్ (77 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 46), ఖుష్దిల్ షా (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 38) రాణించారు.అనంతరం కోహ్లీ (111 బంతుల్లో 100: 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో  56) మెరుపులతో ఇండియా 42.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.