జనాల్లో ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ విషయంలో అదే చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ సినిమా విడుదల గురించి ఆర్జీవీ అనౌన్స్ చేశారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో జులై 25 ఉదయం 11గంటలకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పవర్ స్టార్ సినిమా గురించి ప్రస్తావించారు. ప్రపంచ చరిత్రలో ఇంత వరకు కనీవినీ ఎరుగని విధంగా మనిషి రూ.25 కట్టి ట్రైలర్ చూడొచ్చన్నారు. దీనికి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సినిమా జులై 25 శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపిన ఆర్జీవీ.. దానికంటే ముందు జులై 22న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని, అందుకోసం రూ.25 కట్టి
చూడాలని సూచించారు. జులై 25న సినిమా విడుదల చేస్తున్నామని రూ. 150తో పాటు జీఎస్టీ కట్టి టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ ఆఫర్ జులై 25 ఉదయం 11గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. లేదంటే సినిమా థియేటర్ లో బ్లాక్ టికెట్లు కొన్నట్లు కొనాల్సి వస్తుందంటూ ఆర్జీవీ ఈ పవర్ స్టార్ సినిమా విడుదల గురించి ఆడియో టేప్ ను విడుదల చేశారు.
