పిచ్చ కామెడీ : విలేకరుల ప్రశ్నలకు RGV సమాధానాలు

పిచ్చ కామెడీ : విలేకరుల ప్రశ్నలకు RGV సమాధానాలు

వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వర్మ.. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆర్జీవీ మార్క్ సమాధానాలు వచ్చాయి.. పిచ్చ పిచ్చ కామెడీని..సిల్లీ ఆన్సర్లతో..పంచ్ ఇచ్చిన వర్మ డైలాగ్స్ విందామా..

విలేకరి : మీకు చంద్రబాబు అంటే ఇష్టమా.. కోపమా..?
ఆర్జీవీ : చంద్రబాబు అంటే నాకు రసగుల్లా కంటే ఎంతో ఇష్టం.. రసగుల్లా అంత ప్రేమ
విలేకరి : ఎన్నికల టార్గెట్ గా సినిమా రిలీజ్ చేస్తున్నారా..?
ఆర్జీవీ : ఎన్నికల కోసమే సినిమా తీశాం.. ఎన్నికల ముందు కాక ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాం..సినిమా తీసిందే అందుకు.. మీ ఫేస్ ఓసారి చూపించండి..
విలేకరి : సలార్ సినిమాతో వస్తున్నారు కదా.. 
ఆర్జీవీ : ఇది స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం తీశాం.. దానికీ దీనికి సంబంధం లేదు.. రియల్ ఇన్సిడెంట్ తో తీసింది.. 
విలేకరి : రియల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు.. ఇంక కొత్తగా చూపించేది ఏముంటుందీ..
ఆర్జీవీ : వాళ్ల బెడ్ రూములు, బాత్రూంలో ఏం జరిగిందో చూపిస్తా.. 
విలేకరి : సినిమా రిలీజ్ తర్వాత జగన్ మళ్లీ గెలుస్తాడా..
ఆర్జీవీ : నేను జ్యోతిష్యుడిని కాదు.. నేను దేవుడినే నమ్మను.. నన్ను ఇలాంటి క్వశ్చన్ వేయటం ఏంటీ..?
విలేకరి : మీరు ఏం చూసి.. పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయ్యారు..?
ఆర్జీవీ : పవన్ కల్యాణ్ లో నిలకడ లేదు.. అతన్ని చూస్తుంటే నాకు ఎంటర్ టైన్ మెంట్.. అందుకే ఇష్టం..
విలేకరి : గాజు గ్లాసు, కమలం పువ్వు. సైకిల్ పోస్టర్ లో ఉన్నాయి.. ఏంటి సంగతి..
ఆర్జీవీ : మీ జర్నలిస్ట్ అయ్యిండి.. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా.. చెప్పకోడదనే కదా అలా పోస్టర్ రిలీజ్ చేసింది.. 
విలేకరి : తెలంగాణలో జగన్ పాత్ర ఉంటుందా..
ఆర్జీవీ : జస్ట్ టచ్ చేసి వదిలేశాం.. అది లైట్.. చాలా చాలా
విలేకరి : మీరు ఫ్యూచర్ లో ప్రజా సేవ చేసే ఉద్దేశ్యం ఉందా?
ఆర్జీవీ :  అసలు అలాంటి ఆలోచనే లేదు..రాదు.
విలేకరి: జగన్ మోహన్ రెడ్డికి వ్యూహం స్పెషల్ షో చూపిస్తారా?
ఆర్జీవీ : జగన్ మోహన్ రెడ్డి అయినా..టికెట్ కొని సినిమా చూడాల్సిందే. కానీ, చంద్రబాబు నాయుడుకి మాత్రం ఫ్రీ షో చూపిస్తా. 

అంతేకాకుండా..రేవంత్ రెడ్డి గెలుపు..మరో వర్గం కంట పన్నీరులా ఉందన్నారు. ఇక తెలంగాణలో ఉన్నంత బలమైన ప్రతిపక్షం ఏపీలో లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నా సినిమాలో కనబడేవి రియల్ క్యారెక్టర్లు, నేను చూసినవి నేను తెలుసుకున్నవి అన్నిటినీ బేరీజు వేసుకుని..వర్మ స్టైల్లోనే తీసిన సినిమా ఇదని పంచ్ వేశారు. వైఎస్ జగన్ అంటే నాకు పాజిటివ్ ఒపీనియన్ అని అన్నారు. అయితే నేను ఎవ్వరికీ ఓటు వెయ్యాలో మాత్రం చెప్పనని తెలిపారు. 

వ్యూహం 2 సినిమాలో వైఎస్సార్ మరణించిన టైం నుండి జగన్ సీఎం అయ్యేదాకా..ఎవరెవరూ ఏమేమి వ్యూహాలు పన్నారనేది సినిమాలో ఉంటోంది. కోడి కత్తి కేసు..వివేకా నందా హత్య కేసు గురుంచి విలేకరి అడగ్గా..ఇది అది కాదు..అన్ని వ్యూహం సినిమాలో ఉంటాయని వివరించారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 29 న థియేటర్లో రిలీజ్ కానుంది.