రామ్ గోపాల్ వర్మ కొత్త ఫ్యాన్సీ ఆఫీస్‌.. భవనం లోపల అన్నీ అవే బొమ్మలు

రామ్ గోపాల్ వర్మ కొత్త ఫ్యాన్సీ ఆఫీస్‌..  భవనం లోపల అన్నీ అవే బొమ్మలు

సెన్సేషనల్ అండ్ కాంట్రవర్శియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. హైదరాబాద్ లో ఓ కొత్త ఆఫీస్ ను నిర్మించి ట్రెండింగ్ లో నిలిచారు. ఆర్జీవీ డెన్ పిలుస్తోన్న ఈ భవనంలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. ఈ ఆఫీస్ లోని ప్రాంతాలు రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను ఆర్జీవీ అప్పట్లోనే తెలియజేశారు.

ఆర్జీవీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఈ డెన్ కేవలం సినిమా ఆఫీసుగా వాడటం కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ డిజైన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ భవనానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో ఆయన సినిమాల్లో గతం నుంచి ఇప్పటి వరకు జరిగిన సన్నివేశాలను, సినిమాలను గుర్తుకు తెచ్చేదిగా ఉంది. ఓ పెద్ద కుర్చీలో ఆర్జీవీ కూర్చున్న ఫొటోతో ఆఫీసు ముందు భాగాన్ని డిజైన్ చేశారు. లోపల అమ్మాయిల నగ్నత్వం తో కూడిన ఫొటోలు చాలానే కనిపించాయి. వివిధ కోట్స్ తో, అడవిని, గుహను తలపించే భవనం లోపలి భాగాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ తనకున్న ప్రేమను కూడా ఆర్జీవీ ఈ నిర్మాణం ద్వారా ప్రదర్శించాడు. నాగార్జున, మియా మాల్కోవా, శ్రీదేవి, ఐశ్వర్యరాయ్, సంజయ్ దత్, ఏఆర్ రెహమాన్ లాంటి ప్రముఖుల పెద్ద చిత్రాలను గోడలపై అమర్చారు. మధ్య మధ్యలో ఆర్జీవీ బాడీ గార్డ్స్ కనిపించగా, మరికొందరు స్టాఫ్ అక్కడ కంప్యూటర్లలో పని చేస్తూ కనిపించారు.

ఈ ఆఫీస్ లో సృజనాత్మకత ఉట్టిపడేలా డిజైనింగ్ ఉంది. అధునాతన స్ర్కీనింగ్ థియేటర్లు, ఇతర సౌకర్యాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆర్జీవీ దీన్ని కార్పొరేట్ కార్యాలయానికి ధీటుగా ఈ ప్రొడక్షన్ హబ్ ను నిర్మించారు. సంవత్సరానికి డజనుకు పైగా చలనచిత్రాలు, బహుళ OTT ప్రదర్శనలు మరియు అన్ని భారతీయ భాషలలో డిజిటల్ కంటెంట్ యొక్క స్పెక్ట్రమ్‌ను రూపొందించడానికి ఉంచబడిన RGV DEN సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను సేకరించడానికి ఒక కేంద్రంగా మారనుంది.

https://twitter.com/RGVzoomin/status/1667766727852298241