అంతలా ఏముంది! ఆడియన్స్ ఇష్టపడేది ఈ సినిమాలనే: RGV

అంతలా ఏముంది! ఆడియన్స్ ఇష్టపడేది ఈ సినిమాలనే: RGV

యానిమల్ మూవీ సాధిస్తోన్న కలెక్షన్స్..సినిమా మేకింగ్స్..థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ ఇలా అన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే సినిమాపై కాంట్రవర్సీలు కూడా అలానే హైలెట్ అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ సంచనల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

సినిమాలో హింసా, మహిళలపై వేధింపులు వంటి సన్నివేశాలు తప్పా ఏమీ లేవని, యానిమల్ సినిమాను ఒక బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపిస్తూ పార్లమెంట్ లో మండిపడ్డారు రంజీత్ రంజన్. దీంతో ఈ ఇష్యు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లేటెస్ట్గా ఎంపీ రంజీత్ రంజన్ చేసిన కామెంట్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. గౌరవనీయమైన మేడమ్ రంజీత్ రంజన్ జీ..ఈ యానిమల్ మూవీపై మీకున్న చెడు అభిప్రాయం, దీనిపై మీరు చూపిస్తోన్న వింత గురించి ఒక విషయం చెప్పలకుంటున్నాను. 

దీవార్ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా అమితాబ్ బచ్చన్ నుండి..దార్ లో మానసిక రోగిగా కనిపించిన షారుఖ్ ఖాన్ వరకు అలాగే సంజయ్ దత్ ఖల్నాయక్ లో నటించిన బందిపోటు నుండి KGF 2లో యష్ ది కిల్లర్ వరకు..ఇండియన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డది మీరు బ్యాడ్ అనుకుంటున్నా యానిమల్ సినిమాలనే అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం RGV ట్వీట్ వైరల్ అవుతోంది. 

అసలేం జరిగింది:

యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్న తన కూతురు యానిమల్ సినిమాకు వెళ్లి ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిందని, సినిమాలో హింసా, మహిళలపై వేధింపులు వంటి సన్నివేశాలు తప్పా ఏమీ లేవని, యానిమల్ సినిమాను ఒక బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపిస్తూ పార్లమెంట్ లో మండిపడ్డారు రంజీత్ రంజన్. దీంతో ఈ ఇష్యు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ విషయంలో రంజీత్ రంజన్ ఫై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే..మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కారణం.. యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేయడమే. A సర్టిఫికెట్ అంటే 18 ఏళ్ళ లోపు పిల్లలు ఈ సినిమా చూడాటానికి వీలులేదు. రంజీత్ రంజన్ కూతురు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు. అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు 16, 17 ఏళ్ళ వయసుండే ఆవకాశం ఉంది. అలాంటప్పుడు..ఆమె యానిమల్ సినిమాకు ఎలా వెళ్లారంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.