నారా లోకేష్ పాదయాత్ర ఆపేస్తే మంచిది.. వర్మ ఉచిత సలహా

నారా లోకేష్ పాదయాత్ర ఆపేస్తే మంచిది.. వర్మ ఉచిత సలహా

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు.  లేటెస్ట్ గా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.   జనం రానందున  లోకేష్ పాదయాత్ర ఆపేస్తే మంచిదని ట్విట్టర్లో ఉచిత సలహా ఇచ్చారు.  ఏదో ఒక హెల్త్ రీజన్ తో డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి పాదయాత్ర ఆపేస్తే టీడీపీకి, చంద్రబాబు ఆరోగ్యానికి మంచిదని వ్యాఖ్యానించారు.  వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు దుమారం రేపుతున్నాయి.

‘పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్..  ఒక టెర్రిఫిక్ ఐడియా చేయొచ్చు!. చెస్ట్ నొప్పో, లిగమెంట్  తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని, పాదయాత్ర ఆపేస్తే టీడీపీకి, చంద్రబాబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నా ఉచిత చచ్చు సలహా ’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.  ప్రస్తతం నారా లోకేష్ చేపట్టిన యవగళం పాదయాత్ర 15 రోజు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో  కొనసాగుతోంది.