ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది: ఆర్జీవీ

ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది: ఆర్జీవీ

సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘ పవర్ స్టార్- ఎన్నికల ఫలితాల తర్వాత కథ’’. ఈ సినిమాపై వ‌రుస ట్వీట్ల చేస్తూ తెగ ప్ర‌చారం చేసుకుంటున్నాడు ఆర్జీవీ. అయితే పవన్ అభిమానులు మాత్రం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మపై యుద్ధం ప్రకటించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ‘‘ జనసేన కార్యకర్తలుగా చెప్పుకునే పీకే అభిమానులు నా కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ‘‘ పవర్‌స్టార్’’కు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ కల్పించినందుకు పవన్ ఫ్యాన్స్‌ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందని వర్మ ట్వీట్ చేశారు.