రూ.5 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

రూ.5 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

ఆత్మకూర్, వెలుగు: భూ పట్టా విషయంలో రూ.5 వేలు లంచం తీసుకొంటూ వనపర్తి జిల్లాకు చెందిన ఆర్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం మోటంపల్లికి చెందిన గట్టన్నకు గ్రామ శివారులోని సర్వే నం.217, 218, 220, 221లో 2.26 ఎకరాల భూమి ఉంది. దాన్ని తమ పేరు మీదకు మార్చాలని గట్టన్న వారసులు నాగప్ప, మాబమ్మ మీసేవలో అప్లికేషన్​పెట్టుకున్నారు. అయితే స్థానిక ఆర్ఐ నర్సింహులు విచారణ పేరుతో ప్రాసెస్​ను లేట్​చేస్తూ వచ్చాడు. చివరికి రూ.10 వేల లంచం డిమాండ్​చేశాడు. రూ.5 వేలు ఇస్తామని ఒప్పుకున్న నాగప్ప, మాబమ్మ.. తర్వాత లంచం విషయాన్ని ఆత్మకూరుకు చెందిన బంధువు జానకిరాములుకు చెప్పారు. అతని ద్వారా ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం ఆర్ఐ తహసీల్దార్ ఆఫీసులో రూ.5 వేలు లంచం తీసుకొంటుండగా, ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, సీఐలు జిలాని, లింగస్వామి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్​చేయనున్నట్లు డీఎస్పీ  తెలిపారు.