బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే యత్నం : రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్

బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే యత్నం : రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్

​​​​​ఆసిఫాబాద్, వెలుగు: ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని, గతంలో నాలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ ఈ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ బీఎల్ ఏలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఆసిఫాబాద్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇరుకుల మంగ, కూడ్మేత విశ్వనాథ్, డీసీసీ ప్రెసిడెంట్ సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ రావు, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ శ్యాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.