అబార్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీం కోర్టు

అబార్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీం కోర్టు

అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అబార్షన్ కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని రద్దు చేసింది. దాదాపు 50ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా అబార్షన్ ను చట్టబద్ధత చేస్తూ వెలువడిన తీర్పును కొట్టివేసింది. రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిని చారిత్రాత్మక తీర్పును సుప్రీం కొట్టివేసింది. దీనికి సంబంధించి ఒక అధికార పత్రం లీక్ అవడంతో ఆలస్యంగా ఈ నిర్ణయం వెలుగుచూసింది. ఇక ఈ తీర్పు అమెరికాలో అబార్షన్ హక్కులను పూర్తిగా మార్చేయనుంది. 

రో వర్సెస్ వేడ్ కేసు

అమెరికాలో 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలు అబార్షన్ కు చట్టబద్ధత కల్పిస్తూ తీర్పు వెలువడింది. అప్పటినుండి అక్కడ అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి.అయితే నియంత్రణ లేని అబార్షన్లు మహిళల అబార్షన్లపై ప్రభావం చూపుతాయని..అబార్షన్లకు చట్టబద్దత రద్దుచేయాలని అమెరికాలోని కొందరు కొంతకాలం నుండి పోరాడుతున్నారు. ఇక సుప్రీం తీర్పుతో 25 రాష్ట్రాల వరకు అబార్షన్లను నిషేధించే అవకాశాలున్నాయి. 

గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలె

‘‘గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని మేం భావిస్తున్నాం. అబార్షన్లను నియంత్రించే హక్కు ప్రజాప్రతినిధులు, ప్రజలకు తిరిగి దక్కుతుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే కోర్టు తీర్పు పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా బరాక్ ఒబామా వంటి ఎంతో మంది విస్మయం వ్యక్తం చేశారు.‘‘ ఇది అమెరికాకు విచారకరమైన రోజు. అబార్షన్ కు చట్టబద్ధత తొలగించడంతో ఎంతో మహిళల ఆరోగ్యం,జీవితం ప్రమాదంలో పడింది. మహిళల హక్కులను కాపాడేందుకు నా అధికారులను ఉపయోగిస్తూ అవసరమైన కృషి చేస్తాను’’ అని బైడెన్ అన్నారు. 

కాగా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఎంతో మంది సుప్రీంకోర్టు ఎదుట నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.