కొడుకు అంతర్జాతీయ క్రికెటర్.. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న తండ్రి

కొడుకు అంతర్జాతీయ క్రికెటర్.. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న తండ్రి

కొడుకు ఉన్నత స్థితికి చేరాలని కష్టపడే తండ్రులు ఉన్నారు. అయితే తన బిడ్డకు సక్సెస్ వచ్చి భారీగా సంపాదిస్తున్న తన పని మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ కూలి పని చేసుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు పంపిణి చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. అతడెవరో కాదు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకొని భవిషత్తు స్టార్ గా ఎదుగుతున్న రింకూ సింగ్ తండ్రి. 

2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ అద్భుతంగా రాణించాడు. 14మ్యాచ్ ల్లో 474 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో భారత టీ20 జట్టులో స్థానం సంపాదించిన ఈ యూపీ ఆటగాడు సత్తా చాటాడు. ప్రత్యర్థి ఎవరైనా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిన రింకూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. బాగా సంపాదిస్తూ రాయల్ గా గడుపుతున్నాడు. అయితే తన తండ్రి వద్దన్నా ఇప్పటికే పని చేసుకుంటున్నాడని రింకూ వెల్లడించాడు. 

మా దగ్గర తగినంత డబ్బు ఉంది. సిలిండర్‌ల పంపిణి చేయడం ఆపేసి రెస్ట్ తీసుకోవాలని మా నాన్నకు సూచించాను.అయినా నా మాట వినకుండా తన ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని..పని చేసుకుంటున్నాడు. అని రింకూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు.ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని సామాన్య కుటుంబం నుండి వచ్చిన రింకూ సింగ్..కష్టాలను తట్టుకుంటూ  అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు. ఇప్పటి వరకు భారత జట్టు తరపున 15 టీ20 మ్యాచ్ ల్లో 356 పరుగులు, 2 వన్డేల్లో 55 పరుగులు చేశాడు.