తిరుపతిలో దొంగ ఓట్ల రచ్చ.. వైసీపీ, బీజేపీ మధ్య గొడవ

తిరుపతిలో దొంగ ఓట్ల రచ్చ.. వైసీపీ, బీజేపీ మధ్య గొడవ

తిరుపతి : తిరుపతిలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని వైసీపీ, బీజేపీ బూత్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. జగన్మాత చర్చి దగ్గర ఉన్న పోలింగ్ కేంద్రంలో ఇతరుల ఓట్లు వేయడానికి కొంతమంది వైయస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో ఎన్డీఎ కూటమి బూత్ ఏజెట్లు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఐదుగురిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ఎడ్డీఎ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.