బెంగాల్, ఒడిశా, ఏపీతో పాటు పలు చోట్ల వేడి గాలులు: ఐఎండీ
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే మూడు నాలుగు రోజులు బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని గురువారం తెలిపింది. దేశంలోని సెంట్రల్, ఈస్ట్, నార్త్‌వెస్ట్‌లోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్‌లోని గంగానది పరివాహాక ప్రాంతాల్లో, ఏప్రిల్ 15న ఏపీలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిశాలో, ఏప్రిల్ 15 నుంచి 17 వరకు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
