70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కాంతారా సినిమాకు గాను ఉత్తమ నటుడిగా..హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) ఎంపికయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డ్స్ వరించినప్పటికీ..ఈ జాతీయ అవార్డు కాంతారా ప్రీక్వెల్(Kantara Chapter 1)పై మరింత బాధ్యతని పెంచింది. అందుకు తగ్గట్టుగానే ప్రీక్వెల్ కాంతారా కోసం కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ సిద్దం చేసుకుని..నటి నటుల దగ్గర నుంచి సినిమా సెట్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి వీరుడి ఫోజులో ఫిట్గా ఉన్న న్యూలుక్ ఫోటో రిలీజ్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ ఫొటోలో రిషబ్ శెట్టి కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తూ..కదనరంగంలోకి దూకుతున్న వీరుడీలా కనిపిస్తున్నాడు. అలాగే ఒక చేతిలో రక్షక కవచం..మరో చేతిలో పదునైన కత్తితో శత్రువుపై దూకడానికి గంబీరమైన కంటి చూపుతో సంసిద్దమైన ఫైటర్ లా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా అప్డేట్ విషయానికి వస్తే..బెంగుళూరు ఔటర్ లో కొన్ని భారీ సెట్లు నిర్మిస్తున్నారు మేకర్స్. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
— Rishab Shetty (@shetty_rishab) August 22, 2024
రిషబ్ శెట్టి..ఈ ప్రీక్వెల్ కోసం హై లెవెల్ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. కాంతారా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు రూ.400 కోట్ల వరకు కల్లెక్షన్స్ సాధించి కన్నడ ఇండస్ట్రీలోనే బాక్సాపీస్ బాద్షా అనిపించుకుంది. కానీ, రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్లు మాత్రమే. దీంతో ఈ ‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నాడని న్యూస్ వినిపిస్తోంది. అంటే అతని రెమ్యునరేషన్ 25 రెట్లు పెంచేసాడన్న మాట.