IND vs SA: సెహ్వాగ్‌ను దాటి అగ్రస్థానానికి.. టీమిండియా తరపున పంత్ ఆల్‌టైం రికార్డ్

IND vs SA: సెహ్వాగ్‌ను దాటి అగ్రస్థానానికి.. టీమిండియా తరపున పంత్ ఆల్‌టైం రికార్డ్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సిక్సర్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బాదిన ఆటగాళ్ల లిస్ట్ లో మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ 91 సిక్సర్లను అధిగమించి 92 సిక్సర్లతో పంత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆటలో భాగంగా పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. మహరాజ్ బౌలింగ్ లో లాంగన్ దిశగా సిక్సర్ కొట్టిన పంత్ 92 సిక్సర్లతో సెహ్వాగ్ ను వెనక్కి నెట్టాడు. 27 ఏళ్ళ పంత్ కేవలం 83 టెస్ట్ ఇన్నింగ్స్ ల్లోనే 92 సిక్సర్లు కొట్టడం విశేషం.    

ఈ మ్యాచ్ కు ముందు సెహ్వాగ్ ను అధిగమించడానికి పంత్ కు రెండు సిక్సర్లు అవసరం. పంత్ తొలి ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లతో టాప్ లోకి వచ్చాడు. ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన పంత్ 24 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి లంచ్ కు ముందు ఔటయ్యాడు. ఓవరాల్ గా టెస్టుల్లో అత్యధిక టెస్ట్ రికార్డ్స్ కొట్టిన వారిలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 136 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మెక్కలం (107), గిల్ క్రిస్ట్ (100), గేల్(98), సౌథీ (98) వరుసగా రెండు, మూడు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే కోల్‌‌‌‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి సెషన్ లో మూడు వికెట్లు తీసుకొని టీమిండియాకు పోటీనిస్తుంది. రెండో రోజు లంచ్ సమాయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (11), ధృవ్ జురెల్ (5) ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 21 పరుగులు వెనకబడి ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, మహరాజ్, హార్మర్,కార్బిన్ బాష్ తలో వికెట్ పడగొట్టారు.