గువాహటి: అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియా టీమ్‌ను సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలెక్టర్లు గట్టి షాకిచ్చారు. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పంత్‌ను తప్పించిన సెలెక్టర్లు.. వన్డే టీమ్‌లో అసలు చోటే కల్పించలేదు. టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్, వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లండ్ టూర్‌కు అతను అందుబాటులో ఉంటాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకూ రెస్ట్ ఇచ్చారు. ఆఫ్ స్పిన్నర్ మానవ్ సుతార్, పేసర్ గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు కల్పించారు.
ప్రిన్స్ యాదవ్‌ను వన్డేల్లోకి తీసుకున్నారు. వన్డే వైస్ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. రెండో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు చాన్స్ ఇచ్చారు. వచ్చే నెల 6 నుంచి ముల్లన్‌పూర్‌లో ఏకైక టెస్ట్, 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.
