రిషబ్ పంత్‌‌కే డిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్సీ

రిషబ్ పంత్‌‌కే డిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్సీ


ముంబై:  గతేడాది రన్నరప్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఈ సీజన్‌‌  స్టార్టింగ్‌‌కు ముందే  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌‌తో వన్డే సిరీస్‌‌లో షోల్డర్‌‌ ఇంజ్యురీకి గురైన  ఆ టీమ్‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ లీగ్‌‌కు దూరమయ్యాడు. భుజానికి సర్జరీ చేయించుకోనున్న శ్రేయస్‌‌ కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టనుంది. దీంతో, ఈ సీజన్‌‌కు అతని ప్లేస్‌‌లో కొత్త కెప్టెన్‌‌గా రిషబ్‌‌ పంత్‌‌ను ఎంపిక చేసినట్టు  క్యాపిటల్స్‌‌ మంగళవారం ప్రకటించింది. ‘శ్రేయస్‌‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. అతని కెప్టెన్సీలో  మా టీమ్‌‌ కొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ సీజన్‌‌లో మేం అతడిని చాలా మిస్‌‌ అవుతున్నాం. శ్రేయస్‌‌ ప్లేస్‌‌లో  ఈ సారి రిషబ్‌‌ పంత్‌‌ కెప్టెన్‌‌గా మా టీమ్‌‌ను నడిపిస్తున్నాడు. తను మరింత ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. న్యూ రోల్‌‌లో పంత్‌‌కు ఆల్‌‌ ది బెస్ట్‌‌’ అని డీసీ చైర్మన్‌‌ కిరణ్‌‌ కుమార్‌‌ గాంధీ  పేర్కొన్నారు. ఐపీఎల్‌‌తోనే వెలుగులోకి వచ్చిన పంత్‌‌ ఇప్పుడు టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఈ ఇయర్‌‌ అతని కెరీర్‌‌కు ఎంతో ప్లస్‌‌ అయింది. అయితే, దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న పంత్‌‌ కెప్టెన్‌‌గా టీమ్‌‌ను ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.  కాగా,  కొత్త సీజన్‌‌ కోసం  క్యాపిటల్స్‌‌ టీమ్‌‌ తమ ప్రిపరేషన్స్‌‌ స్టార్ట్‌‌ చేసింది. ముంబై క్రికెట్‌‌ క్లబ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) గ్రౌండ్‌‌లో ఆ టీమ్‌‌ ప్లేయర్లు మంగళవారం తమ ఫస్ట్‌‌ ట్రెయినింగ్‌‌ సెషన్‌‌లో పాల్గొన్నారు.  రహానె, ఇషాంత్‌‌ శర్మ, ఉమేశ్‌‌ నెట్​  ప్రాక్టీస్‌‌  చేశారు.