Rishabh Pant : నిద్రపోయి కారు నడిపిండు..ప్రమాదానికి గురైండు..

Rishabh Pant : నిద్రపోయి కారు నడిపిండు..ప్రమాదానికి గురైండు..

స్వయం కృతాపరాధం అనే మాటకు నిదర్శన ఘటన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రమాద సంఘటన. న్యూఇయర్ వేడుకులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకుని హుటాహుటీన బయలుదేరిన రిషబ్ పంత్..కారు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి  పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. అయితే ప్రమాద సమయంలో పంత్ నిద్రపోతూ కారు నడిపినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ తెలిపాడు. 

సర్ ప్రైజ్ ఇద్దామనుకుని..

లంకతో సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రిషబ్ పంత్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కారులో ఉత్తరాఖండ్కు బయలుదేరాడు. న్యూఇయర్ వేడుకలకు హాజరై తన తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పంత్ తెల్లవారుజామునే బయలుదేరాడు. అతివేగంగా కారును నడుపుతున్న పంత్..నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే వెంటనే తేరుకున్న రిషబ్ పంత్ కారులో నుంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. 

పంత్ వచ్చే విషయం తెలియదు..

ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్ను రూర్కి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.  తల, లెగ్‌తో పాటు వీపు భాగంలో గాయలయ్యానని పేర్కొంది. అతని కాలు కూడా విరిగినట్లు తెలుస్తోంది. పంత్ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అతని తల్లి సరోజ్ పంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. గత 3-4 రోజులుగా ఇంటికి రావాలని పంత్‌ను కోరినట్లు ఆమె మీడియాకు తెలిపారు. పంత్ వచ్చే విషయాన్ని తమకు చెప్పలేదని ఏడుస్తూ చెప్పారు.

https://twitter.com/ANINewsUP/status/1608687253467058179

ప్రమాద వీడియో...

పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం స్థానిక పోలీసులు పుటేజీని విడుదల చేశారు. లైట్ల వెలుతురులో వేగంగా వెళ్తున్న పంత్ కారు..రెయిలింగ్ను బలంగా ఢీకొట్టి..పల్టీలు కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన 6 నిమిషాల తర్వాత కారులో మంటలు చెలరేగినట్లు స్పష్టమవుతోంది. అటు డివైడర్ దగ్గర కూలబడిన పంత్ను స్థానికులు కొందరు రక్షించారు. ఈ సమయంలో కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. 

పంత్ విఫలం..

టీ20 వరల్డ్ కప్తో పాటు..న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన పంత్..ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో వచ్చే ఏడాది లంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్కు ఎంపికవలేదు. ఇక తన కెరీర్లో ఇప్పటి వరకు 33 టెస్టులాడిన పంత్..2271 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అటు 30 వన్డేల్లో 865 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక సెంచరీ, 5 అర్థసెంచరీలున్నాయి. 66 టీ20ల్లో 987 రన్స్ సాధించాడు. 3 హాఫ్ సెంచరీలు చేశాడు.