ఫైనల్స్కు రిషి సునాక్, లిజ్ ట్రస్ రెడీ

 ఫైనల్స్కు రిషి సునాక్, లిజ్ ట్రస్ రెడీ

బ్రిటన్  ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్, లిజ్ ట్రస్ ఫైనల్స్ కు రెడీ అయ్యారు. ఫస్ట్ ఫేస్ రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ అయిన టోరీ ఎంపీల ఓట్లలో మొదటి రెండు స్థానాల్లో రిషి సునాక్, లిజ్ ట్రస్ నిలిచారు. తుది విడతలో టోరీ సభ్యుల మనసు గెలిచిన వారే పార్లమెంటులో పార్టీ నేతగా, బ్రిటన్  ప్రధానిగా ఎన్నికవుతారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో పార్టీ సారథ్య బాధ్యతలూ వారికే లభిస్తాయి. టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు రిషి సునాక్ , లిజ్  ట్రస్  ఆరు వారాల పాటు బ్రిటన్ వ్యాప్తంగా పర్యటించనున్నారు. టోరీ సభ్యులతో భేటీలు జరుగుతాయి. ప్రధాన మంత్రి అభ్యర్థులిద్దరూ వారి షెడ్యూలు ప్రకారం సభల్లో ప్రసంగిస్తారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమాలు టీవీల్లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతాయి.

ఫస్ట్ ప్లేస్ లో రిషి సునాక్ ..
టోరీ ఎంపీల మద్దతు పొందడంలో ప్రత్యర్థి లిజ్  ట్రస్  కన్నా రిషి సునాక్  ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రిషికి 137 మంది ఎంపీలు అండగా నిలవగా..ట్రస్ కు 113 మంది మాత్రమే మద్దతిచ్చారు. టోరీల నేత ఎవరో తేల్చాల్సింది అధికార కన్జర్వేటివ్  పార్టీ సభ్యులే. ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా అభ్యర్థులను ప్రసన్నం చేసుకోవడంపైనే ఉంటుంది. టోరీ ఛైర్మన్  ఆండ్య్రూ స్టీఫెన్ సన్  పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. 1922 కమిటీ అధ్యక్షుడు గ్రాహం బ్రాడీ రిటర్నింగ్  అధికారిగా ఉంటారు.

ప్టెంబరు 5న ఫలితాలు..
2019లో అర్హులైన కన్జర్వేటివ్  పార్టీ సభ్యుల సంఖ్య లక్షా అరవై వేలుగా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఆగస్టు 5 వరకు టోరీ సభ్యులకు పోస్టల్  బ్యాలెట్లు అందుతాయి. సెప్టెంబరు 2 సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించవచ్చు. సెప్టెంబరు 5న ఫలితాలు తెలుపుతారు.