
హైదరాబాద్, వెలుగు : ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్–జె60 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన రిషిత రెడ్డి గర్ల్స్ సింగిల్ టైటిల్ నెగ్గింది. సౌతాఫ్రికాలోని ప్రిటోరియా వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో రిషిత 6–0, 6–1తో టాప్ సీడ్ కైట్లిన్ రమ్దుత్ (సౌతాఫ్రికా)ను వరుస సెట్లలో చిత్తు చేసి విజేతగా నిలిచింది.