శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద

శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తు భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బాబ్లీ నిండి గేట్లు ఎత్తివేయడంతో భారీ ఎత్తున శ్రీరాంసాగర్​ కు వరదనీరు వచ్చిచేరుతోంది. బాబ్లీ నుంచి 6,714క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మటట్టం 1065.30అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80టీఎంసీలుండగా.. ప్రస్తుతం 16.405 టీఎంసీలకు చేరింది.