భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు అంతకంత పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే  డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం కాగా… పెట్రోల్ రేటులో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైమ్ రికార్డ్ ను అధిగమించింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ లీటరుకు 20 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 93.80కి చేరింది. డీజిల్ లీటర్ 82 రూపాయల 88కు చేరింది.  తాజా పెంపుతో  జైపూర్ లో పెట్రో, డీజిల్  ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. జైపూర్ లో లీటర్  పెట్రోల్  ధర 93.92 పైసలు కాగా  డీజిల్  85 రూపాయల 93 పైసలకు చేరింది.

తాజాగా పెరిగిన ఆయిల్ ధరలతో హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్ కు 89 రూపాయల 15 పైసలు కాగా డీజిల్ 82 రూపాయల 80 పైసలకు చేరుకుంది.  కోల్ కతాలో లీటర్ పెట్రోల్ 87 రూపాయల 11 పైసలు కాగా… డీజిల్ 79 రూపాయల 48 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ 92 రూపాయల 28 పైసలు కాగా.. డీజిల్ 82 రూపాయల 66 పైసలకు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 88 రూపాయల 29 పైసలు ఉండగా… డీజిల్ 81 రూపాయల 44 పైసలుగా ఉంది.