ఆగని పెట్రోల్ ధర.. హయ్యెస్ట్‎గా రూ. 114.51

ఆగని పెట్రోల్ ధర.. హయ్యెస్ట్‎గా రూ. 114.51

దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.27, డీజిల్‌ రూ. 105.46గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్‌ రూ. 114.04, డీజిల్‌  రూ. 106.26, గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 114.24, డీజిల్‌ రూ. 106.86, దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 107.59, డీజిల్‌ రూ. 96.32, ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 113.46, డీజిల్‌ రూ. 104.38, కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 108.11, డీజిల్‌ రూ. 99.43, చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.52, డీజిల్‌ రూ. 100.59 పైసలుగా ఉంది.

తెలంగాణలో అత్యధికంగా పెట్రోల్ ధర ఆదిలాబాద్‎లో రూ. 114.51 పైసలు, గద్వాలలో రూ. 114.07 పైసలు, నిజామాబాద్‎లో రూ. 114.05 పైసలు భద్రాద్రి కొత్తగూడెంలో రూ. 113.29 పైసలుగా ఉంది. వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో.. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయని వాపోతున్నారు. కూరగాయల ధరలైతే ఆకాశన్నంటుతున్నాయని.. కూరగాయలకు నిత్యం రూ. 50 నుంచి 80 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు.