ఇంటర్​ సిటీ ట్రైన్ కు తప్పిన ప్రమాదం

ఇంటర్​ సిటీ ట్రైన్ కు తప్పిన ప్రమాదం
  •                 జమ్మికుంట దగ్గర పట్టా విరిగినట్లు గుర్తింపు
  •                 ట్రాక్ సిబ్బంది సమాచారంతో రైలు నిలిపివేత

ట్రాక్​ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో సికింద్రాబాద్​- సిర్పూర్​ కాగజ్​ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​ రైలుకు ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్​ జంక్షన్​ నుంచి బయలుదేరిన ఇంటర్​సిటీ (17011) ట్రైన్​ జమ్మికుంట స్టేషన్​కు చేరుకునే క్రమంలో రైలు పట్టా విరిగిపోయింది. దీన్ని గమనించిన ట్రాక్​ సిబ్బంది వెంటనే రైల్వేస్టేషన్​ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రైలు వేగం తగ్గించి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది రిపేర్ చేయడంతో ట్రైన్ యథావిధిగా బయల్దేరింది.